లగచర్ల గ్రామంలో ఫార్మ భూముల సేకరణలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించేందుకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషనర్ జానోతు హుస్సేన్ ను కలువకుండా పోలీసులు అడ్డుకొని సోమవారం కడ్తాల్ మండల బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి దశరథ నాయక్, నాయకులు సేవ్య నాయక్, హరిచంద్ర నాయక్, పాండు, శ్రీను, మహేష్, అంజి లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.