కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో అమ్మవారి రథోత్సవాన్ని సోమవారం తెల్లవారుజామున కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు ఆలయానికి చేరుకొని రథాన్ని లాగి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం మైసమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ శిరోలి, ఈవో స్నేహలత, అర్చకులు పాల్గొన్నారు.