మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో గత నాలుగు నుండి ఐదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. వాతావరణం అకస్మాత్తుగా మారడం వల్ల ప్రజలు దైనందిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఉదయం మరియు సాయంత్రపు వేళల్లో చలి తీవ్రంగా ఉండడం కారణంగా పిల్లలు, వృద్ధులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు.