ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు

59చూసినవారు
ఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. డీఎస్సీని వాయిదా వేయాల‌ని కోరుతూ పలువురు అభ్య‌ర్థులు ఇటీవల నిర‌స‌న‌కు దిగారు. హైద‌రాబాద్‌ లోని విద్యాశాఖ కార్యాల‌యం వద్ద నిరసన చేపట్టారు.