ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పిందని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని విశ్రాంత ఇంజినీర్, ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడు తెలిపారు. బోట్లు ఢీకొట్టడంతో దెబ్బతిన్న గేట్లను నిన్న రాత్రి ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత మరమ్మతు చేపడతామని, పనులు పూర్తయ్యేందుకు 15 రోజుల సమయం పడుతుందన్నారు.