మైలార్ దేవ్ పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ లో నల్ల పోచమ్మ దేవాలయం ఏర్పాటు చేసిన సనాతన గోశాలకు స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు శుక్రవారం సదర్శించారు. వాస్తవానికి సనాతన సాంప్రదాయంలో గోమాతను పూజించడం ఆచారమన్నారు. పురాణ గ్రంథాలలో సైతం గోమాతకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన సేవాసమితి సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.