బౌద్ధ నగర్ మధురానగర్ లోని బంగారు మైసమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఏసిపి జైపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సైదులు, కరుణాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, కాలనీ మెంబర్లు పాల్గొన్నారు.