పద్మారావునగర్ లో గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యం
చిలకలగూడ పిఎస్ పరిధి పద్మారావునగర్ లో గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ గ్రాండ్ మార్కెట్ ఎదురుగా ఉన్న బస్సు షెల్టర్ వద్ద పడి ఉన్న దాదాపు 60 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడిని గుర్తు పట్టిన వారు పీఎస్ లో సంప్రదించాలని సూచించారు.