శేరిలింగంపల్లి నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కట్ట వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం శేర్లింగంపల్లి(106) డివిజన్ లో రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీ, పాపి రెడ్డి కాలనీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద కుమార్ గౌడ్, ఖైరతాబాద్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ నాయుడు విచ్చేసారు.
ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్, 106వ డివిజన్ కో- ఆర్డినేటర్ ఏరువ సాంబశివ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కో-ఆర్డినేటర్ పాటూరి వెంకట్రావు, బాలాజీ, తుమ్మల ప్రసాద్, రామారావు, శ్రావణ్ కుమార్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.