శేర్లింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు గచ్చిబౌలి లో సోమవారం భారీగా గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. విశ్వాసనీయ సమాచారం మేరకు బీదర్ నుండి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ఉంటాను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడు జియగుడ కు చెందిన శ్రీకాంత్(25) గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు నుండి 9. 3 కేజీల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.