బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్ నగరం లో మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 29న ఘనంగా దీక్ష దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపుచ్చారు. రేవంత్ రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. కేసీఆర్ స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపడుకుంటామన్నారు.