షాద్‌నగర్ మున్సిపాలిటీ జానంపేట లో గల వివేకానంద కాలనీ బస్వన్న దేవాలయం లో శుక్రవారం దుండగులు శివలింగాన్ని ద్వసం చేయడంపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణలో అనేక దేవాలయాల్లో విగ్రహాలను ద్వంసం చేయడం దారుణమని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోమని హెచ్చరించారు.