రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ గిరిజన ఆదివాసి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ వివేకానంద కాలనీలో గుర్తు తెలియని దుండగులు శివలింగం అపహరణ, ఇతర ధ్వంసం సంఘటనకు సంబంధించి శనివారం ఏర్పాటు చేసిన స్థానిక మీడియా సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.