కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు తరుచూ జరుగుతున్నాయని, కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి వికృతానందం పొందుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని జానంపేటలో గల పురాతన శివాలయంలో శివలింగం అపహరణ, ఇతర విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు.