అమ్మవారి కృప భక్తులందరికీ ఉండాలని గురువారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో ఇప్పల కట్ట వద్ద కొలువుదీరిన బంగారు మైసమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ. 50, 000/-వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగవంతుడి కృపతో భక్తులందరూ చల్లగా ఉండాలని అన్నారు. అందువల్ల నా వంతు సహాయ అర్థంగా నేను సహాయాన్ని అందిస్తున్నాను అన్నారు.