చైనా మొబైల్ తయారీ సంస్థ Realme ఇండియా మార్కెట్‌లో Narzo 80 సిరీస్‌లో భాగంగా Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. Narzo 80 Pro ధర రూ.17,999 నుంచి ప్రారంభమవుతుంది. Narzo 80x ధర రూ.11,999 నుంచి మొదలవుతుంది. రెండు ఫోన్లు అమెజాన్, Realme వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.