AP: ముద్రా యోజన 10వ వార్షికోత్సవంలో ఏపీకి చెందిన మహిళ ప్రధాని మోదీతో మాట్లాడారు. ముద్రా రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. తనకు హిందీ రాదని, తాను తెలుగులోనే మాట్లాడుతానని చెప్పారు. ‘కెనరా బ్యాంకు నుంచి రూ.2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019లో వ్యాపారం మొదలుపెట్టాను. నా చెల్లింపులు బాగా ఉండటాన్ని చూసి బ్యాంకు రూ.9.5 లక్షల రుణం ఇచ్చింది. ఇప్పుడు నా దగ్గర 15 మంది పని చేస్తున్నారు.’ అని అన్నారు.