తెలంగాణలో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఇక పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్, గద్వాల్ జిల్లాల్లో శని, ఆది వారాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని ప్రజలను హెచ్చరించింది.