కోకాపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత (Video)

80చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కన్నెర్ర చేశారు. సర్వే నెంబర్ 147లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై గండిపేట తహసీల్దార్ విచారణ జరిపి.. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేత పర్వం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్