భారత విదేశీ మారక నిల్వలు నవంబర్ 1 నాటికి 682.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారంతో పోలిస్తే నిల్వలు 2.67 బిలియన్ డాలర్లు క్షీణించాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు భారత్‌లో గరిష్ఠ స్థాయిని తాకి 704.885 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వలు 1.224 బిలియన్ డాలర్లు ఎగసి 69.751 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద భారత నిల్వలు నాలుగు మిలియన్ డాలర్లు అధికమై 4.311 బిలియన్ డాలర్లకు పెరిగాయి.