TG: రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సిద్ధిపేట జిల్లా కొడకండ్ల సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్ రహదారిపై వెళుతున్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం.. ప్రమాదాన్ని గుర్తించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.