ఓ యువతి కిటికీకి వెళాడుతూ బస్సు ఎక్కుతున్న వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈమె ప్రమాదకర విన్యాసం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ బస్టాండ్‌లో చాలామంది ప్రయాణికులు బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు అక్కడికి వచ్చి ఆగింది. దీంతో ఒక్కసారిగా అంతా బస్సులోకి ఎక్కేశారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరగింది. ఇంతలో ఆ యువతికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే కిటికీలోంచి బస్సు ఎక్కేసింది.