తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం చేసి పంపిన బిల్లులకు ఆమోదం తెలుపాలని గవర్నర్‌కు సూచించింది. స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల పలు బిల్లులను పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపగా ఆయన నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది.