పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్

65చూసినవారు
పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్
పార్టీ ఫిరాయింపులపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో తమకు పూర్తి మెజారిటీ ఉందని. ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశ్యం తనకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని తాను చూడటం లేదని, కానీ ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే మాత్రం అందుకు తగిన విధంగా తమ గేమ్ మారుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.