నీట్-యూజీ సవరించిన మార్కుల జాబితాలను ఈ వారంలో ప్రకటించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. సవరించిన మార్కుల జాబితాను వెంటనే అప్‌డేట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఎన్‌టిఎను ఆదేశించింది.సవరించిన ఫలితాలు exams.nta.ac.in/NEET/ లింక్‌లో అందుబాటులో ఉండనున్నట్లు ఎన్‌టిఎ ప్రకటించింది.