బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు

60చూసినవారు
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు
బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ కోర్టు వద్ద నిరసనలు చేశారు. దాంతో ఒబైదుల్ హసన్ దిగొచ్చారు. తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్