విరాట్ కోహ్లీని అధిగమించిన రిషభ్‌ పంత్

81చూసినవారు
విరాట్ కోహ్లీని అధిగమించిన రిషభ్‌ పంత్
భారత స్టార్ ఆటగాడు రిషభ్‌ పంత్ ఈ ఏడాది క్రికెట్‌ ఆర్జనలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఐపీఎల్‌లో శాలరీ రూ.27 కోట్లు కాగా.. బీసీసీఐ కాంట్రాక్ట్‌తో అతడికి రూ.5 కోట్లు రానున్నాయి. వీటి ద్వారా రిషభ్ పంత్‌ క్రికెట్ ద్వారా ఆదాయం రూ.32 కోట్లకు చేరనుంది. విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌ ద్వారా రూ.21 కోట్లు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌తో రూ.7 కోట్లు వస్తాయి. మొత్తం రూ.28 కోట్లతో విరాట్ రెండో స్థానంలో నిలిచాడు.