AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోచుకుంటున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ ఛార్జీల కంటే రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టాలని కోరారు. కాగా, మామూలు రోజుల్లో రూ.1500 వరకు ఉండే టికెట్ల ధర.. ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నాయి.