సినిమా స్టైల్‌లో దోపిడీ (VIDEO)

72చూసినవారు
మహారాష్ట్రలోని నవీముంబైలో ఆదివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ఖార్ఘర్ ప్రాంతంలో బీఎం జ్యువెలర్స్ దుకాణంలోకి కొందరు దుండగులు వచ్చారు. హెల్మెట్లు పెట్టుకుని ముఖం కనిపించకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. దుకాణంలోని బంగారు నగలు, నగదు తీసుకుని పరారయ్యారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే, సినిమా స్టైల్‌లో ఈ దోపిడీ జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్