టీ20 వరల్డ్ కప్ లో అత్యంత ఒత్తిడి ఉండే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అదుర్స్ అనిపించారు. తన పదునైన వ్యూహాలతో పాక్ పై 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. తొలి ఓవర్లలో వికెట్లు పడకపోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నారు. సరైన సమయానికి రోహిత్ చేసిన బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు ఫలించాయి. ముఖ్యంగా బుమ్రాను కీలక సమయాల్లో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. రెండు రివ్యూలు తీసుకోగా అవీ సూపర్ హిట్ అయ్యాయి.