సీనియర్ క్రికెటర్‌పై రోహిత్ శర్మ వ్యవహరించిన తీరుకు ‘రోహిత్ నువ్వు సూపర్’ అంటూ నెట్టింట ప్రశంసలు కురిపించారు. వాంఖడే మైదానం 50 ఏళ్ల సంబరాల్లో భాగంగా రోహిత్ శర్మ వేదిక వద్దకు వచ్చేటప్పటికే గవాస్కర్, సచిన్, ఎడుల్జీ, రవిశాస్త్రి కూర్చొని ఉన్నారు. రవిశాస్త్రిని తన పక్కన ఉన్న సీటును చూపిస్తూ అందులోకి రావాలని రోహిత్ సూచించాడు. మాజీ క్రికెటర్‌ను మధ్యలో కూర్చోబెట్టి ఆ పక్కనే రోహిత్ ఆశీనులయ్యాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.