ఫేక్‌ కాల్‌తో బోల్తా: రూ.81 లక్షలు కోల్పోయాడు..

63చూసినవారు
ఫేక్‌ కాల్‌తో బోల్తా: రూ.81 లక్షలు కోల్పోయాడు..
పుణేకు చెందిన 68 ఏండ్ల రిటైర్డ్‌ కెమెఇకల్ ఇంజనీర్‌ మే మూడో వారంలో ఫేక్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. బాధిత ఇంజనీర్‌ మనీల్యాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ సమస్య పరిష్కరించేందుకు ముంబై సీబీఐ చీఫ్‌తో మాట్లాడాల్సి ఉంటుందని ఇన్‌స్పెక్టర్‌ నమ్మబలికాడు. నేరారోపణల నుంచి మీ పేరు తొలగించేందుకు ప్రభుత్వ ఖాతాల్లో రూ.81 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్లుగా జమ చేయాలని మభ్యపెట్టాడు. ఆపై మరికొంత డబ్బు కోసం నిందితులు ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :