ఫిలిప్పీన్స్‌ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్‌గార్డ్‌ ఓడ!

57చూసినవారు
ఫిలిప్పీన్స్‌ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్‌గార్డ్‌ ఓడ!
దక్షిణ చైనా సముద్రంలోని స్పార్ట్లీ ద్వీపాల వద్ద చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్‌ నౌక ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరకు రవాణా ఓడను ఢీకొంది. దీనికి బాధ్యత ఫిలిప్పీన్స్‌ నౌకదే అంటూ బీజింగ్‌ ఆరోపించింది. ‘ఫిలిప్పీన్స్‌ సరకు రవాణా నౌకను ఎన్నిసార్లు హెచ్చరించినా వినలేదు. అది మా ఓడ వైపు దూసుకొచ్చి ఢీకొంది. దీంతో చట్టప్రకారం మా నౌక దానిపై నియంత్రణ సాధించింది’ అని ఆరోపించింది.

సంబంధిత పోస్ట్