ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.8,500: రాహుల్ గాంధీ

43480చూసినవారు
ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.8,500: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని, అలాగే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.8,500 జమ చేస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ప్రధాని కాలేరని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు వస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్