అరచేతులను కలిపి రుద్దడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మన అరచేతులలో ఎన్నో ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎన్నో భాగాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో రెండు అరచేతులను కలిపి రుద్దినప్పుడు చేతుల్లో వేడి, శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతాయి. దీంతో రక్తం శరీరమంతా బాగా ప్రసరిస్తుంది. ఇంకా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయి.