‘తండేల్‌’ నుంచి సాయి పల్లవి బర్త్‌డే స్పెషల్ వీడియో

85చూసినవారు
నేడు అందాల సహజ నటి సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ‘తండేల్‌’ చిత్ర బృందం బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తండేల్‌ సినిమా షూటింగ్‌ లో సాయి పల్లవికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను తాజాగా విడుదల చేసింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్‌’ సినిమాలో నాగ చైతన్యతో కలిసి సాయి పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.