సమంత కొత్త సినిమా టైటిల్ 'మా ఇంటి బంగారం’

77చూసినవారు
సమంత కొత్త సినిమా టైటిల్ 'మా ఇంటి బంగారం’
హీరోయిన్ సమంత నుంచి కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బంగారం లాంటి కబురు చెప్పింది సమంత. తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రం టైటిల్‌తో కూడిన పోస్టర్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఈ చిత్రానికి 'మా ఇంటి బంగారం’ అని టైటిల్‌ పెట్టారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.