స్వలింగ సంపర్కులకు షాకిచ్చిన ఇరాక్

71చూసినవారు
స్వలింగ సంపర్కులకు షాకిచ్చిన ఇరాక్
స్వలింగ సంపర్కాన్ని నేరంగా గుర్తించే బిల్లును ఇరాక్ పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం స్వలింగ సంపర్కం చేసేవారికి 10-15ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌జెండర్లకూ ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. దేశంలో మతపర విలువలను కాపాడేందుకు ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ఇరాక్ భావిస్తోంది. అయితే, ఈ చట్టం ఎల్జీబీటీ హక్కులను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్