మండల కేంద్రమైన రాయికోడు గ్రామంలో ఊరడమ్మ బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామ పురవీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఊరడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.