రామాయంపేట: రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

60చూసినవారు
రామాయంపేట: రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కామారెడ్డి వై జంక్షన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు.. ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురికి గాయాలు కాగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 ద్వారా క్షతగాత్రులను రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్