కంగ్టి మండల ఘనపూర్ లో మంగళవారం బీటీ రోడ్లకు అంచనా విలువ రూ. 2 కోట్ల 14 లక్షలతో బీటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బార్డర్ నుంచి ఘనపూర్ వరకు బీటీ రోడ్ కోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రాకేష్ కుమార్ షెట్కార్, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.