శ్రీరామ మందిర అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఈ నెల 30న నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో శ్రీరామ మందిరం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గురుస్వామి కె. శివానంద్, మోహన్ గౌడ్ తెలిపారు. రక్తం దాతలు అధిక సంఖ్యలో వచ్చి రక్త దానం చేసి శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఒకరి రక్తం మరొకరి ప్రాణం అన్నారు. మధ్యానం 12: 30 నుండి రక్తదాన శిబిరం ప్రారంభం అవుతుందని అన్నారు.