హైదరాబాద్ లో ఈనెల 7 తేదీన జరగాల్సిన లక్ష గొంతులు- వేల డబ్బులు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ నియోజకవర్గం కన్వీనర్ అలిగే జీవన్ తెలిపారు. నారాయణఖేడ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు వాయిదా వేసినట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.