AP: వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఒక్కో వ్యాపారస్తుడు ఒక్కో శైలి ఫాలో అవుతుంటారు. తాజాగా కాకినాడలో ఓ మద్యం వ్యాపారి కిక్ ఇచ్చే ఆఫర్ ప్రకటించారు. తన దుకాణంలో అన్ని బ్రాండ్లు దొరుకుతాయని, కొనుగోలు చేసిన వారికి టోకెన్లు పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఈ టోకెన్లను లక్కీ డ్రా తీస్తామని.. ఇందులో ప్రథమ బహుమతి గెలుచుకున్న వారికి ఉచితంగా థాయిలాండ్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ ఆఫర్ గురించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయించగా.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.