సదాశివపేట మండల పరిధిలోని నిజాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998-99లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోట చేరి తమ అనుభవాలు నెమరు వేసుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు.