విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గొమ్మాటి గుమ్మడిదలలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు ఇటీవల పంపిణీ చేసిన కిట్లతో బోధించాలని చెప్పారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.