సంగారెడ్డి గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన చోరీ కేసులు గుమ్మడిదల పోలీసు చేదించారు. సీఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని బంగారు నగలు దోచుకెళ్లారు. సీసీటీవీ ఆధారంగా హమీద్ సయ్యద్ (42) పోలీసులు గుర్తించారు. నిందితుడు పై ఇప్పటికే 200 దొంగతనాల కేసులు ఉన్నాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.