సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల గడ్డపోతారం సబ్‌స్టేషన్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏడీఈ శ్రీకాంత్, ఏఈ రాజు తెలిపారు. గుమ్మడిదల విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ఖాజీపల్లి, వావిలాల గ్రామాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.