టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆవుల రాజిరెడ్డిని, హత్నూర మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆయన నివాసంలో శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తున్న ఆవుల రాజిరెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టం ఎంతో సంతోషకరమన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి శ్యామ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.