పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ

637చూసినవారు
పారిశుద్ధ కార్మికులకు సరుకులు పంపిణీ
తండ్రి ప్రేమను వెలకట్టలేని సామాజిక సేవలకు పూనుకుంది ఓ కన్నా కూతురు. హత్నూర మండలం కసాల గ్రామానికి చెందిన దంపతులు రావుల కోరి నాగమణి, పి ఎస్ ఎస్ డైరెక్టర్ వెంకటేష్ తండ్రియైన శంకరయ్య జ్ఞాపకార్థం గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు గ్రామ సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి, కార్యదర్శి నవీన్ రెడ్డి చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ రాణి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేని ప్రేమ అని అన్నారు. తన మామగారైన క్రీస్తు శేషులు స్వర్గీయ శంకరయ్య జ్ఞాపకార్థం ద్వితీయ సంవత్సరం కాసాల గ్రామపంచాయతీలో గల పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్వర్గీయ శంకరయ్య జ్ఞాపకాలతో పతియేట వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రావుల కోరి నాగమణి వెంకటేష్ దంపతులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కరోబార్ సురేష్, యాదగిరి, అరుణ్ గౌడ్, నాగేష్, గంగయ్య, బిక్షపతి, దుర్గేష్, సాయిలు, సంజీవ, తుడుం సాయిలు, మల్లేశం, శంకర్, మాణయ్య, కిష్టయ్య, మంగమ్మ, సంతోష తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్